
మహారాష్ట్ర: నంద్‌గావ్ తహసీల్‌లోని శింగనాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రికెటర్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును.. కాంక్రీట్ మిక్సర్ తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు క్రికెటర్లు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా స్థానికంగా యావత్మాల్‌లో నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
మృతి చెందిన వారిని అమరావతి నగరానికి చెందిన రీహరి రౌత్, జయూశ్ బహాలే, సుయాశ్ అంబర్టే, సందేశ్ పదార్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.