డీటీహెచ్ కనెక్షన్లకూ పోర్టబిలిటీ

డీటీహెచ్ కనెక్షన్లకూ పోర్టబిలిటీ

న్యూఢిల్లీ: మొబైల్ కనెక్షన్ల మాదిరే డీటీహెచ్ కనెక్షన్లకూ ఇంటర్ ఆపరేబులిటీ ఫీచర్ అందుబాటులో ఉండాలని టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ కు (ఎంఐబీ) శనివారం రికమండ్ చేసింది. సరియైన నిబంధనలు తీసుకోవచ్చని దీనిని తప్పని సరి చేయాలని కోరింది. ఇంటర్ అపరేబిలిటీ వస్తే  సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే  డీటీహెచ్ ప్రొవైడర్ ను మార్చుకునే  అవకాశం కష్టమర్ కు ఉంటుంది.

ప్రస్తుతం డీటీహెచ్ లతో వస్తున్న  సెటాప్ బాక్సులకు  నాన్ ఇంటర్ ఆపరేబుల్ . ఈ ఎస్ టీబీలతో ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు మారడానికి వీలుండదు. ఇండియాలోని  టెలివిజన్ సెట్స్ అన్నీ యూఎస్ బీ పోర్ట్ బేస్డ్ కామన్ ఇంటర్ ఫేస్ అందుబాటులో ఉండాలనే ప్రొవిజన్ ను తప్పని సరి చేయాలని ట్రాయ్ రికమండ్ చేసింది. ఐబీ మినిస్ట్రీతో  కలిసి కమిటీని ట్రాయ్ ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందులో  మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , బయో ఆఫ్ ఇండియన్ స్ట్రాండర్డ్స్ (బీఐఎస్), టీవీ మాన్యూఫ్యాక్చరింగ్ ప్రతినిధులు మెంబర్లుగా ఉంటారు.  వీరు రివైజ్ చేసిన ఎస్ టీబీ స్టాండర్ట్స్ ను అమలు చేస్తారు.  ఇంటర్ ఇపరేబిలిటీ ఎస్టీబీలు లేకపోవడం వలన కష్టమర్లు

తమకు నచ్చిన ప్రొవైడర్లకు  మారడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.   అంతేకాకుండా టెక్నాలజికల్ ఇన్నోవేషన్, సర్వీస్ క్వాలిటీ మెరుగుదల వంటివి కూడా వెనకబడుతున్నాయి. దీని వల్ల సెక్టార్ గ్రోత్ కూడా నెమ్మదిస్తున్నదని ట్రాయ్ పేర్కొంది.