హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి బుధవారం ఉదయం 9:00 గంటలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలు రాశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల వారు పార్టీకి సంబంధించిన ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
