RCB vs SRH: ఇదెక్కడి విధ్వంసం.. 39 బంతుల్లోనే హెడ్ సెంచరీ

RCB vs SRH: ఇదెక్కడి విధ్వంసం.. 39 బంతుల్లోనే హెడ్ సెంచరీ

ఐపీఎల్ లో హెడ్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటివరకు పవర్ ప్లే లో మెరుపు ఇనింగ్స్ లతో ఆకట్టుకున్న హెడ్..  నేడు (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ లో బెంగళూరుపై మరింతలా చెలరేగి సెంచరీ చేశాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఆసీస్ వీరుడు.. మరో 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

హెడ్ ఇన్నింగ్స్ ల్లో 9 ఫోర్లు, 8 సిక్సులున్నాయంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో మనం అర్ధం చేసుకోవచ్చు. హెడ్ ధాటికి ప్రస్తుతం సన్ రైజర్స్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 158 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. పవర్ ప్లే లో ఏకంగా 76 పరుగులు చేయడమే కాదు 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటింది. క్లాసన్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు.