RCB vs SRH: పరుగుల వరద పారిస్తున్న SRH.. 7 ఓవర్లకే 100

RCB vs SRH: పరుగుల వరద పారిస్తున్న SRH.. 7 ఓవర్లకే 100

ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల మోత మోగిస్తున్నారు. బెంగళూరుపై పవర్ ప్లే లో విరుచుకుపడుతూ ఏకంగా 76 పరుగులు చేశారు. 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆర్సీబీ బౌలర్లను బెంబేలెత్తించాడు. హెడ్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ తొలి ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. అయితే హెడ్ చెలరేగడంతో టాప్లీ వేసిన రెండో ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి.ఇక ఐదు, ఆరో ఓవర్లో కలిపి ఏకంగా 38 పరుగులు పిండుకున్నారు. పవర్ ప్లే తర్వాత వీరి విధ్వంసం ఆగలేదు. విజయ్ కుమార్ వైశుక్ వేసిన 7 ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం సన్ రైజర్స్ వికెట్ నష్టపోకుండా 8 ఓవర్లకు 108 పరుగులు చేసింది. క్రీజ్ లో హెడ్ (71), అభిషేక్ శర్మ (34) ఉన్నారు.