ఐపీఎల్ 2026 లో భాగంగా ఆర్సీబీ, సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే... ఈ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ తనను ఆన్ లైన్లో వేధిస్తున్నారంటూ వెల్లడించింది ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా.
2023 వరల్డ్ కప్ తర్వాత ఎదురైన పరిస్థితులు గుర్తొస్తున్నాయని.. మ్యాచ్ జరిగిన మరుసటి రోజున సోషల్ మీడియా మొత్తం అసభ్యకర వ్యాఖ్యలతో నిండిపోయిందని..తనతో పాటు తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ను కూడా టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది జెస్సికా.
స్పోర్ట్స్ లో ఎమోషన్స్ సహజమే కానీ.. ప్లేయర్లకు కూడా ఫ్యామిలీలు ఉంటాయని ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలని.. ప్లేయర్ల ఫ్యామిలీని కూడా మనుషులేనని అంది జెస్సికా. ఇన్నింగ్స్ ఐపోయాక పరస్పరం గౌరవించుకోవాలని.. ఇలా ట్రోల్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది జెస్సికా.
