గిరిజన కొమ్ము నృత్య కళాకారులను అడ్డుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ఏర్పాటు

గిరిజన కొమ్ము నృత్య కళాకారులను అడ్డుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న జనగర్జన సభకు వెళ్తున్న ప్రజలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బహిరంగ సభకు వెళ్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు, ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతున్నారు.

రాహుల్ గాంధీ సభలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్న గిరిజన కొమ్ము నృత్య కళాకారులను పోలీసులు అడ్డుకున్నారు. వారి సామాగ్రిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు. ఆ తర్వాత వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం జరిగినా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన కొమ్మునృత్య కళాకారులు ప్రదర్శనలు ఇస్తుంటారు. ఎప్పటిలానే ప్రదర్శనలు ఇవ్వడానికి ఖమ్మంకు వెళ్తున్న గిరిజనులను పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.