ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు అందజేత

ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు అందజేత

బషీర్ బాగ్, వెలుగు: దివ్యాంగులలో ఆత్మస్థైర్యం పెంపొందించి, ఉపాధి కల్పించేలా ‘సక్షమ్ తెలంగాణ’ సంస్థ పనిచేస్తుందని సంస్థ ఉపాధ్యక్షుడు దయాకర్ చెప్పారు. ఆదివారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో దివ్యాంగులకు ఆయన ఉపకరణాలు పంపిణీ చేశారు. 120 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు అందజేశారు.