V6 News

ట్రినిటి స్టూడెంట్లు అద్భుత ప్రతిభ

ట్రినిటి స్టూడెంట్లు అద్భుత ప్రతిభ

కరీంనగర్ టౌన్,వెలుగు: ఐఐటీ, జేఈఈ  మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటి జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, ఫౌండర్ చైర్మన్ దాసరి  మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ  సందర్భంగా వారు  మాట్లాడుతూ.... ఇ.మైత్రేయ 61వ ర్యాంకు, జి.సాయిప్రసాద్102, ఎ.అశ్విన్ నాయక్ 733,  జె.శ్రీహంస 1,754,  పి.మనోహర్ 3,523, వి.గోపాలకృష్ణ 3,725, బి.రామ్ చరణ్​4,252,  చి.రోహిత్ 4,704,  ర్యాంకులు సాధించినట్లు చెప్పారు.

జేఈఈ  అడ్వాన్డ్స్‌‌‌‌లో ఇ.మైత్రేయ 99.94  పర్సంటైల్, ఎం.కారుణ్య99.25,  శ్రీహంస 99.17, గోపాలకృష్ణ 99.08, శివచరణ్​98.54,  కౌశిక్ 97.83, శివమణి 97.44, బి.శ్రీరాజ్ 97.03 పర్సంటైల్స్ సాధించడం  గర్వకారణమన్నారు. డైరెక్టర్ దాసరి మమత, ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.