విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదు

విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదు

అసెంబ్లీలో విభజన హామీల అమలుపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాడీవేడీగా చర్చ జరిగింది. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించగా..అనుకున్న దానికంటే ఎక్కువగానే తెలంగాణకు నిధులు కేటాయించామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం కమిటీ వేసిందన్నారు. కాజీపేట రైల్వే కోచ్ కూడా తర్వలో కార్యాచరణ దాలుస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేశామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ కోసం భూములు కేటాయించినా కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష  చూపిస్తుందని మండిపడ్డారు. 

విభజన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ను డిక్లేర్ చేయాలని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రం ఇస్తామన్న ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రపర్యటనకు వచ్చే కేంద్రమంత్రులు విభజన హామీలను ప్రస్తావించాలని అన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా..మిడతల దండులాగ  రాష్ట్రంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.  యూపీఏ ఐటీఆర్ ఇస్తే మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. విభజన హామీలపై రాష్ట్రం ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు.