
మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నీ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇంకా నోటిఫికేషన్ రానప్పటికీ ఇప్పటీకే అక్కడ భారీ బహిరంగ సభలను నిర్వహించి హోరెత్తించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు తాయిలాలు ప్రారంభించింది.
చౌటుప్పల్ మండలం, సంస్థన్ నారాయణపురం మండలంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, కారు బొమ్మతో ఉన్న గడియారాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇప్పటికే సుమారు 8, 000 గడియారాలను అన్ని వార్డులలో పంపిణీ చేశారు.
మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటినుంచే గడియారాలను పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.