
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాపులర్ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తేవడమే కాకుండా.. రూ. 99 కే బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇకపై వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూంల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం రాబట్టే ప్లాన్ లో భాగంగా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కూటమి సర్కార్ సెప్టెంబర్ లో కొత్త బార్ల పాలసీ ప్రకటించనుందని... ఇందులో భాగంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పర్మిట్ రూంల ఏర్పాటు కోసం మద్యం షాపు యజమానులు నుంచి గత ఏడాది రూ. 5 లక్షలు వసూలు చేసింది కూటమి ప్రభుత్వం.
పర్మిట్ రూమ్ల అనుమతులను రెండు భాగాలుగా విభజించింది ప్రభుత్వం. మున్సిపాలిటీ పరిధిలోని మద్యం షాపులకు అయితే.. పర్మిట్ రూమ్ ఫీజు రూ. 7.5 లక్షలుగా, మిగతా చోట్ల రూ. 5 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం. పర్మిట్ రూంలకు అనుమతి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.