నాలుగోరోజు కన్నప్ప కలెక్షన్స్ ఎంతంటే.. ? మండే టెస్ట్ పాస్ అయ్యిందా.. ?

నాలుగోరోజు కన్నప్ప కలెక్షన్స్ ఎంతంటే.. ? మండే టెస్ట్ పాస్ అయ్యిందా.. ?

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మించిన సినిమా కన్నప్ప. జూన్ 27న విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకొని.. మంచు విష్ణు కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఆదివారం ( జూన్ 29 ) నాటికి రూ. 22.53 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నాలుగో రోజైన సోమవారం ( జూన్ 30 ) దారుణంగా డ్రాప్ చూసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాటికి కన్నప్ప సినిమా కలెక్షన్స్ కేవలం రూ. 55 లక్షలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. డీసెంట్ టాక్ అందుకున్న ఈ సినిమా వీకెండ్ వరకు బాగానే వసూళ్లు రాబట్టినప్పటికీ సోమవారం భారీగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

ALSO READ | స్టార్ కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో మంచు విష్ణు నెక్స్ట్ మూవీ.. ?

భారీ అంచనాల నడుమ విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మండే టెస్ట్ అవ్వలేకపోయిందనే చెప్పాలి. తొలిరోజు కన్నప్ప సినిమా రూ.9.35 కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్ రూ.8.25 కోట్లు రాబట్టింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రెండో రోజు 23.53% స్వల్పంగా తగ్గి రూ.7.15 కోట్లు వసూలు చేసింది, కానీ ఆదివారం ఈ సినిమా కాస్త తగ్గుముఖం పట్టింది. మూడో రోజు రూ.6.03 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది. నాలుగోరోజు సాయంత్రానికి రూ. 55 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

కన్నప్ప మూవీ పాన్ ఇండియా భాషల్లో విడుదలైనప్పటికీ, తెలుగులో మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. ఆదివారం, తెలుగు వెర్షన్ 42.33 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. తమిళ వెర్షన్ 24.83 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా  విష్ణు నాస్తికుడు నుండి శివునికి పరమ భక్తుడిగా మారే గిరిజన వేటగాడు 'తిన్నడు' పాత్రలో నటించారు. 

రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ మరియు కిరాతగా మోహన్ లాల్ వంటి నటులు అతిధి పాత్రలలో కనిపించారు. అలాగే, ఈ మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రీతి ముఖుందన్, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ మరియు బ్రహ్మానందం వంటి నటీనటులు తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు.