Good Food : వానాకాలంలో ఈ కూరగాయలు తింటే.. జలుబు, దగ్గు, జ్వరం నుంచి రక్షణ.. వీటిని తినకపోవటమే బెటర్

Good Food : వానాకాలంలో ఈ కూరగాయలు తింటే.. జలుబు, దగ్గు, జ్వరం నుంచి రక్షణ.. వీటిని  తినకపోవటమే బెటర్

కొన్నిరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే సీజన్  వర్షాకాలం. అలాంటి ఈ కాలంలో తినే వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కూరగాయలు వండుకుంటే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు వర్షా కాలంలో తినొద్దు. తింటే వాటివల్ల మైక్రోబియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.. రైనీ సీజన్​ లో ఎలాంటి కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం. . .!

వర్షాకాలంలో ఆకుకూరలు తినకపోవడమేమంచిది. ఆకులపై సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతాయి. అందుకని అవి తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ తో పాటు గ్యాస్ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల కూరగాయలు తినాలి.

కాకరకాయ:  రుచిలో చేదు అనుకుంటాం. కానీ కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని వర్షాకాలంలో తినడం వల్ల గ్యాస్ట్రో ఇంటె స్ట్రెనల్ సమస్యలకు కారణమయ్యే సూక్ష్మక్రిములు దరిచేరవు. అలాగే కాకర జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

కీరదోస: బయటి ఫుడ్ తినడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. కీరలోని హెపటోప్రొటెక్టివ్, యాంటీ ఇన్​ ఫ్లెమేటరీ గుణాలు లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. అలాగే జ్వరం, సర్దితో పాటు ఈ కాలంలో వచ్చే నీరసాన్ని తగ్గిస్తాయి. 

 

పుట్టగొడుగులు (బటన్ మష్రూమ్స్) :ఇవి మట్టిలో మొలుస్తాయి కాబట్టి వీటిని తినడంవల్ల సమస్యలు వస్తాయని చాలామంది నమ్ముతారు. వర్షాకాలంలో వీటిని డైట్ లో చేర్చుకోరు. కానీ, బటన్ మష్రూమ్స్​ ను  ఈకాలంలో బాగా కడిగి వండుకుని తినొచ్చు. ఇందులో తక్కువ క్యాలరీలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి ఇందులో. అందువల్ల మాన్ సూన్ డైట్ లో వీటిని చేర్చుకోవచ్చు.  

ముల్లంగి: వివిధ రకాల పోషకాలున్న రూట్ వెజిటబుల్ ముల్లంగి. ఇది పొట్టకి సంబంధించిన సమస్యలనుంచి, హెపటిక్ ఇన్​ ఫ్లమేషన్, అల్సర్స్​ తో  పాటు ఎన్నోరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రోగనిరోధక శక్తి పెంచడంలో ఉపయోగపడే పాలీఫినాల్స్, ఐసోథియోసైనేట్స్ ముల్లంగిలో ఉంటాయి. జలుబు, జ్వరం వల్ల వచ్చే శ్వాససంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తాయి.  

 

కందగడ్డ: ఇందులో ఎన్నోరకాల పోషక విలువలు ఉంటాయి. వర్షా కాలంలో వచ్చే గ్యాస్ట్రో సమస్యలను తగ్గించడానికి కందగడ్డ ఉపయోగపడుతుంది. ఇందులోని ఫెనోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు దరి చేరనీయవు.  

 

సొరకాయ : వర్షాకాలంలో  వచ్చే ఆరోగ్య సమస్యలకు సొరకాయ చెక్ పెడుతుంది. ఇందులో పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలం. అలాగే కొవ్వు పర్సెంట్ చాలా తక్కువ. సొరకాయ కూర కడుపులో మంటని తగ్గిస్తుంది. అలాగే జ్వరం, దగ్గు రాకుండా నివారిస్తుంది. 

 

బీరకాయ :  దీన్ని నేచురల్ డీటాక్సిఫయర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని ప్యూరిఫై చేసి, శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీరకాయలో కెరోటిన్, అమైనోయాసిడ్స్, ప్రొటీన్లు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా  తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. 

దొండకాయ :సీజనల్ గా వచ్చే సర్ది, దగ్గు, జ్వరంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్లకు దొండకాయ చెక్ పెడుతుంది. అందుకు వీటిలోని ఇన్​ ఫ్లమేటరీ గుణాలే కారణం. అలాగే దొండకాయలు గ్లూకోజ్ లెవల్స్, కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచుతాయి.