మోడీజీ మీ 8 ఏళ్ల పాలనకు 8 ప్రశ్నలు..!

మోడీజీ మీ 8 ఏళ్ల పాలనకు 8 ప్రశ్నలు..!

ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోడీ దేశానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆమె మోడీకి 8 ప్రశ్నలు వేశారు.  ప్ర‌జ‌లకు ఇచ్చిన హామీల అమ‌లులో మోడీ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని..  8 ఏళ్ల పాల‌న‌లో దేశానికి మోడీ చేసిందేమీ లేద‌ని ఆరోపించారు.  దేశాన్ని అన్ని రంగాల్లో దిగ‌జార్చార‌ని మోడీకి క‌విత వేసిన ప్ర‌శ్న‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.

1. స‌మాన అవ‌కాశాల ద్వారా నారీ శ‌క్తికి మ‌రింత ద‌న్ను క‌ల్పిస్తామంటున్నారు క‌దా..మ‌రి మ‌హిళా బిల్లు ఎక్క‌డ‌?
2. దేశంలో క్ర‌మంగా జీడీపీ త‌గ్గుతుంది. వేరే జీడీపీ మాత్రం పెరుగుతుంది. అదే గ్యాస్, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు. ఈ ధ‌ర‌లతో వ‌స్తున్న డ‌బ్బును ఎక్క‌డ పెట్టారు?
3. తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష ఎప్పుడు ముగుస్తుంది?  తెలంగాణ‌కు రావాల్సిన రూ.7 వేల కోట్ల‌ను ఎప్పుడు విడుద‌ల చేస్తారు?
4. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం రికార్డు స్థాయికి చేరింది. మ‌రి దేశంలో అచ్చే దిన్‌ను ఎప్పుడు చూస్తాం?
5. దేశంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌తో పాటు వ్య‌వ‌స్థ‌లు విఫ‌ల‌మ‌య్యాయి.  దేశ ప్ర‌జ‌ల‌కు అమృత ఘ‌డియ‌లు ఎప్పుడిస్తారు?
6. దేశానికి రైతులే గుండె చ‌ప్పుడు. తెలంగాణ‌కు చెందిన‌ వ‌రి, ప‌సుపు రైతుల క‌ష్టానికి కేంద్రం నుంచి క‌నీస గుర్తింపు ద‌క్క‌క అన్యాయానికి గుర‌వుతున్నారు. 
7. న్యూ ఇండియా పేరిట మోడీ స‌ర్కారు ఉపాధికి పాత‌రేశారు. ఫ‌లితంగా కోట్లాది మంది భార‌తీయులు జీవ‌నోపాధికి స‌రిప‌డ వేత‌నాలు అందించే ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. 
8. చివ‌రగా పీఎం కేర్స్ నిధుల‌కు సంబంధించిన లెక్క‌ల‌ను చెప్పే రోజు వ‌స్తుందా?

అని 8 ప్రశ్నలను వరుస ట్వీట్లు వదిలారు. కవిత ట్వీట్లకు పలువురు తమదన స్టైల్లో రీట్వీట్లు వదులుతున్నారు. మీరు ఇచ్చిన హామీలేమైనవి అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.