ఈడీ విచారణకు హాజరైన ఎల్.రమణ

ఈడీ విచారణకు హాజరైన ఎల్.రమణ

చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో 130 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రతిరోజు ఇద్దరిని విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరయ్యారు. నిన్న ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి, హైదరాబాద్ పంజాగుట్ట ఊర్వశి బార్ ఓనర్ యుగంధర్ ను ప్రశ్నించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. గోవా, నేపాల్, థాయ్ లాండ్, హాంకాంగ్ లో క్యాసినోకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈడీ విచారిస్తోంది. మొన్నటికి మొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదద్, ధర్మేంద్ర యాదవ్ లను ఈడీ ప్రశ్నించింది. 

హైదరాబాద్‌‌‌‌కు చెందిన ముగ్గురు మంత్రులతో చికోటి ప్రవీణ్‌‌‌‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చికోటి క్యాసినో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో  18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, 280 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు చీకోటి క్యాసినో బిజినెస్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు.