
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో పరిషత్ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతలకు కారణమైంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో గందరగోళం ఏర్పడింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు ప్రయత్నించారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో… కాంగ్రెస్ లోకల్ లీడర్స్, కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్కడికి వచ్చి రచ్చ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలు విసురుతూ దాడిచేశారు. కొందరిని చితక బాదారు.
ప్రతీకారంగా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ వర్గం వర్కర్లు రాళ్లు విసిరారు. పరస్పర దాడిలో.. కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి… ఉద్రిక్తతలు తగ్గించారు.