ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీ జింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ILFS)లో రూ. 13 వేల కోట్ల మేర లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు ఆడిట్ ఫర్మ్ గ్రాంట్ థార్న్‌టన్ తన ఇంటరిమ్ రిపోర్టులోతెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, రిస్క్ ఎసెస్‌మెంట్ సరిగా చేయకపోవడం, బ్యాంకింగ్ నిబంధనలకు తిలోదకాలు వంటి అవకతవకలు చోటు చేసుకున్నాయని ఐఎల్ ఎఫ్ ఎస్ బోర్డుకు ఇచ్చిన నివేదిక వెల్లడించింది. ఐఎల్ ఎఫ్ ఎస్‌లో ప్రధానంగా పది అతిక్రమణలను గుర్తించినట్లు గ్రాంట్ థార్న్‌టన్ తన 166 పేజీల ఇంటరిమ్ రిపోర్టులో పేర్కొంది.ఐఎల్ ఎఫ్ ఎస్ ఫైనాన్షి యల్ సర్వీస్ లిమిటెడ్ (ILFS)తో నిర్వహించిన రూ. 6 వేల కోట్ల విలువైన లావాదేవీలలో బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లం ఘించినట్లు రిపోర్టు తేల్చింది. ఐఎఫ్ ఐఎన్ రుణగ్రహీతలకు రూ. 2,270 కోట్లను అప్పుగా ఇచ్చారు. ఈ విషయం ఐఎల్ ఎఫ్ ఎస్ పా త డైరెక్టర్ల బోర్డుకు తెలిసే జరిగిందని పేర్కొంది. ఈ మొత్తాన్ని ఐఎల్ ఎఫ్ ఎస్ గ్రూప్ లోని కొన్ని కంపెనీలు వాడుకున్నాయి. ఇందు లో రూ.1,150 కోట్లను ఐఎల్ ఎఫ్ ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్ వర్క్ లిమిటెడ్ (ఐటీఎన్ ఎల్ )కు ఇచ్చారు. బాండ్స్ మీద ఐటీఎన్ ఎల్ చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులను జరపలే కపోవడంతోటే, ఐఎల్ ఎఫ్ ఎస్ గ్రూప్ సంక్షోభం జులై2018 లో బయటకు వచ్చింది. థర్డ్ పార్టీ లకు ఇచ్చిన రుణాలు (ఐఎఫ్ ఐఎన్ రుణగ్రహీతలు)ను వారు ఐఎల్ ఎఫ్ ఎస్ గ్రూప్ లోని మరికొన్ని కంపెనీలు (ప్రధానంగా ఐటీఎన్ ఎల్ ) కోసం వెచ్చించినట్లు రిపోర్టు ప్రస్తావించింది. ఇలా థర్డ్ పార్టీలకు ఐఎల్ ఎఫ్ ఎస్ రుణంగా ఇచ్చిన మొత్తం చాలా సందర్భాలలో అదే రోజున ఐఎల్ ఎఫ్ ఎస్ గ్రూప్ కంపెనీలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇలాంటి వి 29 సార్లు జరిగినట్లు రిపోర్టు వివరించింది. ఐఎఫ్ఐఎన్‌దగ్గర తీసుకున్న రుణాలను గ్రూప్ కంపెనీలు తిరిగి చెల్లించేందుకే ఈ నిధుల మళ్లింపు జరిగిందని అనుకోవచ్చని తెలిపింది.మరో సందర్భంలో ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను తక్కువ వడ్డీకే గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన వైనాన్నీ గ్రాంట్ థార్న్‌టన్ గుర్తించింది. రూ. 1,922 కోట్లను ఈ విధంగా తక్కువ వడ్డీకే గ్రూప్ సంస్థలకు ఇచ్చినట్లు తేలింది. రిస్క్ టీమ్ ప్రమాదమని హెచ్చరించినా కొన్ని కంపెనీలకు ఐఎల్ ఎఫ్ ఎస్ అప్పులిచ్చినట్లు కూడా రిపోర్టు వెల్లడించింది. తక్కువ సెక్యూ రిటీ తీసుకుని, ఎక్కువ రుణాలిచ్చిన సందర్భాలూ ఉన్నట్లు గుర్తించారు.
