ప్రపంచాన్ని స్తంభింపజేసిన యుద్ధం ముగిసింది. చమురు కొరతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతంల చేసిన వార్ కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి. పారిస్ లో ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్, మొసూద్ పెజెస్కియాన్ సంతకాలు చేశారు. పీస్ డీల్ పై సంతకాలు చేసినట్లు ఈ మేరకు అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ ప్రకటన చేశారు.
ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా విడుదల చేసింది. లెబనాన్‌ను శాంతి ఒప్పందంలో భాగం చేశాయి. లెబనాన్‌తో పాటు అన్ని వైపులా సైనిక చర్యల నిలిపివేసేందుకు అంగీకరించారు.
ఇక ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చమురు సరఫరాకు అంతరాయం తొలగనుంది. 30 రోజుల్లో హర్మూజ్ దిగ్బంధం పూర్తిగా ఎత్తివేసేందుకు ఒప్పందం కుదిరింది. అణ్వాయుధం ఎప్పటికీ తయారు చేయమని ఇరాన్ ప్రకటించింది.
ఫ్రాన్స్ వేదికగా శాంతి ఒప్పందం జరిగింది. ఫ్రెంచ్ ప్రసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో సమావేశం సందర్భంగా పీస్ డీల్ పై సంతకాలు చేశారు ట్రంప్. ఒప్పంద పత్రాలపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా సంతకాలు చేసినట్లు ప్రకటించారు.
