ఆయిల్ ఇండస్ట్రీని కాపాడేందుకు టారిఫ్ లను వాడుతా

ఆయిల్ ఇండస్ట్రీని కాపాడేందుకు టారిఫ్ లను వాడుతా
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
  • భారీగా పడుతున్న క్రూడాయిల్ ధరలు
  • ప్రమాదంలో వేల కొద్దీ జాబ్స్

ఆయిల్ ధరలు దారుణంగా పడిపోతుండటంతో .. ఈ ఇండస్ట్రీని కాపాడేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్దమయ్యారు. ఒకవేళ ఆయిల్ ఇండస్ట్రీని కాపాడాల్సి నవసరం వస్తే ఆయిల్ ఇంపోర్ట్‌‌ టారిఫ్‌లను వాడతానని ట్రంప్ హెచ్చరించారు. అవుట్‌ పుట్ కోత విషయంపై రష్యాకు, సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ డిప్లొమాటిక్ టెన్షన్ లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ లీడర్లతో భేటీ అయిన తర్వాత వైట్‌హౌస్‌ ప్రెస్ బ్రీఫింగ్ లో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఒపెక్, ఇతర మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్లు ఇవాళ సమావేశం కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం వాయిదా పడింది. క్రూడాయిల్ ధరలు పడటానికి మీరంటే మీరు కారణమని సౌదీ అరేబియా, రష్యాలు వాదించుకుంటున్నాయి. కరోనా వైరస్ కారణంతో గ్లోబల్‌గా ఆయిల్‌కు డిమాండ్ భారీగా తగ్గింది. అయితే టారిఫ్‌ల పెంపును కొందరు ఇండిపెండెంట్ షేల్ ప్రొడ్యూసర్లు వ్యతిరేకిస్తున్నా రు.

ఉద్యోగులను కాపాడతా…

బయట నుంచి వచ్చే ఆయిల్‌పై టారిఫ్‌లు విధించడంతో వేల కొద్ది ఎనర్జీ వర్కర్లను కాపాడినట్టవుతుందని ట్రంప్ చెబుతున్నారు. తమ గ్రేట్ కంపెనీలు ఎనర్జీ ప్రొడక్షన్‌తో పాటు ఈ ఉద్యో గాలను అందిస్తున్నాయని, తాను చేయాల్సిందల్లా చేస్తానని ట్రంప్ చెప్పారు. ఆయిల్ ధరలు పడిపోవడంతో, ఎనర్జీ వర్కర్ల ఉద్యోగ భద్రత ఇప్పుడు కష్టంగా మారింది. చాలా ఉద్యోగాల పై ఈ ప్రభావం పడుతోంది. ఇప్పటికే కరోనా కారణంతో చాలా వ్యాపారాలు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యూయల్ డిమాండ్ భారీగా పడిపోయింది. రోజుకు నమోదయ్యే లక్షల బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ డిమాండ్ పడిపోయింది

ఎవర్ని టార్గెట్ చేయట్లే…

ఆయిల్ టారిఫ్స్‌ తో తాను రష్యా లేదా సౌదీ అరేబియా దేన్ని టార్గెట్ చేయడం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ ప్లేస్‌‌ను కాపాడాలని ఆయిల్ మేజర్ ప్రొడ్యూసర్లకు సూచించారు. అయితే రష్యా, సౌదీలు ఒక డీల్ కుదుర్చుకుంటాయని ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ‘వారు ఈ సమస్యను సెటిల్ చేసుకుంటారు. ఎందుకంటే వారు కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఒకవేళ అలా చేయకపోతే.. వారు కూడా కుప్పకూలాల్సి వస్తుంది’ అని ట్రంప్ అన్నా రు.