ముంబైలో దుమ్ము తుఫాన్‌.. ఈ సీజన్​ లో న‌గ‌రాన్ని తాకిన తొలి చినుకు

ముంబైలో దుమ్ము తుఫాన్‌.. ఈ సీజన్​ లో  న‌గ‌రాన్ని తాకిన తొలి చినుకు

ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. సోమవారం ( మే 13) మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు, ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక... భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

సోమవారం( మే 13)  ముంబైలో తొలి జల్లు కురిసింది.  దుమ్ము విపరీతంగా ఎగసి పడడంతో ట్రాఫిక్ స్థంభించింది. ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షం చోటుచేసుకున్నాయి. ముంబై విమానాశ్రయంలో దుమ్ము తుఫాను చోటుచేసుకోవడంతో అరగంట పాటు విమానాల రాకపోకలు నిలిపేశారు. భారీ వర్షానికి తోడు, ఉరుములు , మెరుపులు భారీ ధూళి తుఫాను ముంబైని ముంచెత్తాయి, భారత వాతావరణ శాఖ (IMD) జిల్లాకు నౌ కాస్ట్ హెచ్చరికను జారీ చేసింది. సెంట్రల్ రైల్వే సర్వీసులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు , తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, రాబోయే 48 గంటల్లో ( మే 14,15)  ముంబై జిల్లాలోని ఏకాంత ప్రదేశాలలో గంటకు 40-నుంచి50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాల ధాటికి నగరంలోని ఘాట్‌కోపర్‌ శివారులో భారీ హోర్డింగ్‌ కూలిపోవడంతో కొంత మంది చిక్కుకుపోయారు. దీంతో అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారీ వర్షాన్ని చవిచూసిన థానే , సతారాలకు IMD తన ఎల్లో అలర్ట్ జారీ చేసింది. థానే జిల్లాల్లోని కళ్యాణ్, అంబర్‌నాథ్, దివా, ముంబ్రా తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండగా, ముంబైలోని తూర్పు శివారు ప్రాంతాల్లో తేలికపాటి చినుకులు పడ్డాయి. మాతుంగ, దాదర్ , ప్రభాదేవిలో కూడా విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తాయి.

 ఘాట్‌కోప‌ర్‌, బంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం భీక‌రంగా మారింది. పాల్గర్‌, థానే ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వ‌ర్షం ప‌డింది. ఆ ప్రాంతంలో గంట‌కు 60 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో భీక‌ర గాలుల వ‌ల్ల చెట్లు నేల‌కూలాయి. ఆరోలి సెక్టర్ 5 ఏరియాలో ఉన్న రోడ్డుపై ఓ భారీ వృక్షం ప‌డిపోయింది. దీని వ‌ల్ల అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.