ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత.. పోలీసులు కొట్టారంటూ ఆందోళన

ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత..  పోలీసులు కొట్టారంటూ ఆందోళన

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసనగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి ఇంటి బయట ఉన్న గ్రామస్తులను,కార్యకర్తలను చెదరగట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. దింతో గ్రామస్ధులకు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది.  తమ ఇంటి వద్ద తాము ఉండగా 144 సెక్షన్ ఏమిటని పోలీసులతో గొడవకు దిగారు గ్రామస్తులు. ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో గ్రామస్ధులను చెదరగొట్టారు పోలీసులు. తమను లాఠీలతో కొట్టిన ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలి ఎస్పీకి పిర్యాదు చేశారు గ్రామస్తులు.