సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

సాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి,ఎడమ కాల్వలకు నీటి విడుదల చేశారు ఏపీ, తెలంగాణ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జగదీష్ రెడ్డి. సాగు నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీటి విడుదల చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున మరో వారం రోజుల పాటు నీటి విడుదల చేయనున్నారు.

కుడి, ఎడమ కాల్వలతో పాటు జంట నగరాల నీటి అవసరాల కోసం SLBC, AMRP కాల్వలకు కూడా నీటిని విడుల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు సామరస్యంగా మెలిగితే రెండు రాష్ట్రాలు ఏదైనా సాధించవచ్చని తెలిపారు. నీటి వివాదాలకు పోకుండా రైతుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.