కలెక్టర్లను బెదిరించి సర్వే చేయిస్తున్నారు

కలెక్టర్లను బెదిరించి సర్వే చేయిస్తున్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని..  సర్వే పై రాత పూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వకుండా కలెక్టర్లను బెదిరించి సర్వే చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ముందు ఎమ్యెల్యే, మంత్రుల ఆస్తులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం రాష్ట్ర ప్రజల శాపమన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని కేంద్రం నిధులతో అబివృద్ది చేస్తాం.. అయితే రాష్ట్రం నుండి ప్రతి పాదనలు పంపండం లేదన్నారు. తాను కేవలం ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు చేస్తానని ఎన్నికల తర్వాత అబివృద్ది ఎజెండా అని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. దేశ ద్రోహి లాంటి ఎంఐఎంకు కేసీఆర్  కొమ్ముకాస్తున్నారు.. టీఆర్ ఎస్ నాయకులకు సిగ్గు ఉండాలి..  కాంగ్రెస్ పార్టీ హయాంలో  ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిచడం తో..హైదరాబాద్ లో బీసీ లకు అన్యాయం జరిగిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ బారి మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ నాయకులను దుబ్బాక ప్రజలు అడ్డుకొని తరిమికొడుతున్నారు.. అందుకే అడ్డదాడి లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ కుమ్మక్కయి బీజేపీ గెలవకూడదని ప్రయత్నిస్తున్నారు…కానీ బీజేపీ గెలవడం ఖాయం అన్నారు. పేద ప్రజలు కూలి నాలి చేసుకొని ప్లాట్ కొనుక్కుంటే… సామాన్యులను దోచుకుంటున్నారు.. డబుల్ బెడ్ రూమ్స్ ఎందుకు ఇవ్వడం లేదు..ఎన్నిఅప్లికేషన్స్ వచ్చాయి..ఎందుకు వివరాలు చెప్పడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.