TGEAPCET: ఇంజినీరింగ్ తొలి విడతలో .. 75 వేల200 సీట్లు కేటాయింపు

TGEAPCET: ఇంజినీరింగ్ తొలి విడతలో .. 75 వేల200 సీట్లు కేటాయింపు

తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడుత సీట్లను  సాంకేతిక విద్యా శాఖ  కేటాయించింది.   మొదటి విడతలో భాగంగా 75,200 ఇంజినీరింగ్ సీట్లు కేటాయించారు.  మొదటి విడత కేటాయింపు తర్వాత మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు  వచ్చిన విద్యార్థులు జూలై 23లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ తెలిపారు.

 కంప్యూటర్ కోర్సుల్లో 99.31శాతం సీట్లు, మెకానికల్ లో 71.54 శాతం, సివిల్ లో 80.68శాతం, ట్రిపుల్ ఈలో 80.88శాతం సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కన్వినర్ కోటాలో 72 వేల741 సీట్లు ఉండగా.. వీటిలో  సీఎస్ఈకి సంబంధించిన 49,786 సీట్లు ఉన్నాయి.