ఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు

ఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు

తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2023 మే 25 గురువారం రోజున ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల కావాలి. కానీ అనివార్య పరిస్థితుల కారణంగా  ఉదయం  9.30గంటలకే ఫలితాలు విడుదల చేయనున్నారు.  

ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.   జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ర్యాంకులను విడుదల చేయనున్నారు.  మే 10 నుంచి 14 వరకు జరిగిన పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.  

ఫలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.