TS EDCET దరఖాస్తు తేదీ గడువు మరోసారి పెరిగింది. బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ పరీక్ష దరఖాస్తు గడువును మే 1 వరకు పొడగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే ఈ ఎగ్జామ్ పరీక్ష దరఖాస్తు గడువును 2 సార్లు పెంచారు.
జనరల్, బీసీ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.550 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మే 5వ తేదీ నుంచి ఆన్ లైన్ లో హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మే 18న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
TS EDCET దరఖాస్తు కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి..
- అధికారిక వెబ్‌సైట్ edcet.tsche.ac.in
