కేటీఆర్.. దావోస్ పోయి ఎన్ని కంపెనీలు తెచ్చినవ్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

 కేటీఆర్.. దావోస్ పోయి ఎన్ని కంపెనీలు తెచ్చినవ్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్ : సూటు బూటు వేసుకొని మూడు సార్లు దావోస్ వెళ్లిన కేటీఆర్ రాష్ట్రానికి ఎన్నికం పెనీలను తెచ్చారో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. సీఎల్పీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం రేవంత్ పై సోషల్మీడియాలో ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేస్తున్నాడని తెలిపారు. రేవంత్ అమెరికా టూర్ సక్సెస్ కావడం బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. కేటీఆర్ తో ఎంవోయూ చేసుకున్న కంపెనీలకు సరైన వసతులు కల్పిం చకపోవడంతో కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు.

విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి సొంత బిల్డింగ్లు కొనుక్కొన్న మీతో... రేవంత్ రెడ్డిని పోల్చుకోవద్దన్నారు. రాష్ట్రం అవమానపడే తప్పులు చేసి తీహర్ జైల్ లో ఎవరున్నారో ప్రజలకు తెలుసన్నారు. బుర్రలేని కేటీఆర్ ఇచ్చిన కేటీఆర్ స్క్రిప్ట్ చదివి బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా దిగజారవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సీఎం రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. తెలంగాణను పెట్టుబడుల స్వర్గంలా తీర్చిదిద్దుతున్నారన్నారు. కొత్తగా పెట్టుబడులు రావడం వల్ల 30, 500 ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.