టెండర్లతో వడ్లు అమ్ముకుంటే వెయ్యి కోట్ల నష్టం!

 టెండర్లతో వడ్లు అమ్ముకుంటే వెయ్యి కోట్ల నష్టం!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిరుడు యాసంగిలో సేకరించిన ధాన్యంలో సగానికి పైగా టెండర్ల ద్వారా అమ్మకానికి పెట్టింది. ఉన్న సగం వడ్లలో ఇప్పటికే మిల్లింగ్‌‌‌‌ పూర్తి కావొచ్చింది. కేంద్రం కస్టమ్​ మిల్లింగ్​రైస్​(సీఎంఆర్)​ గడువు పెంచినా ఇప్పటికే టెండర్ల ద్వారా వడ్లు అమ్మకానికి పెట్టడంతో అధికారులు నష్టం వస్తున్నా అగ్గువకు వడ్లు అమ్ముకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడున్న టైమ్‌‌‌‌లో మిల్లింగ్‌‌‌‌ పూర్తి చేసుకుని నష్టాలు లేకుండా గట్టెక్కే ఆలోచనను విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల ప్రారంభంలో కేంద్రం గత యాసంగి సీఎంఆర్‌‌‌‌ గడువును మే 15వ తేదీ వరకు పొడిగించింది. మిల్లింగ్‌‌‌‌ గడువును దాదాపు రెండు నెలల పాటు పెంచినా ఫలితం లేకుండా పోతోంది. 

సగం వడ్లు అమ్మకానికే..

నిరుడు యాసంగి(2022 – 23)లో రైతుల నుంచి సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ 66.84 లక్షల టన్నుల వడ్లు ఐకేపీ సెంటర్లు, సహకార సంఘాల ద్వారా సేకరించింది. ఇందులో ఇప్పటి వరకు 35 లక్షల టన్నులు గత జనవరి 25న టెండర్లు పిలిచి అమ్మకానికి పెట్టింది. బిడ్‌‌‌‌లు దాఖలు చేసిన 26 కంపెనీలకు 12 లాట్‌‌‌‌లు అమ్ముకునే ఏర్పాట్లు సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ అధికారులు పూర్తి చేశారు. బిడ్లు దక్కించుకున్న సంస్థలకు టెండర్‌‌‌‌ ఫైనలైజ్‌‌‌‌ చేశారు. ఇవి పోగా మిగిలిన వడ్లు మాత్రమే సీఎంఆర్‌‌‌‌ రూపంలో ఇవ్వాలంటూ ఈ నెల ప్రారంభంలోనే  సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్రం సీఎంఆర్‌‌‌‌ డెలివరీ గడువు రెండు నెలలకు పైగా పెంచినా ఫలితం లేకుండా పోయింది. 

ఇప్పటికే 83 శాతం మిల్లింగ్‌‌‌‌..

ప్రస్తుతం రాష్ట్రం నుంచి 31.84 లక్షల టన్నుల వడ్లు మాత్రమే మిల్లింగ్‌‌‌‌ చేసి 21.49 లక్షల టన్నులు ఎఫ్‌‌‌‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 18.54 లక్షల టన్నుల నుంచి 19 లక్షల టన్నుల సీఎంఆర్‌‌‌‌ మిల్లర్లు అప్పగించేశారు. అంటే, సీఎంఆర్‌‌‌‌ ఇచ్చే వడ్లలో ఇప్పటికే 86 నుంచి 90 శాతం మిల్లింగ్‌‌‌‌ పూర్తయింది. ఇంకా మిగిలిన ధాన్యంలో కేవలం 10 నుంచి 14 శాతం మిల్లింగ్‌‌‌‌ చేసి 2.50 లక్షల టన్నుల నుంచి 2.95 లక్షల టన్నుల సీఎంఆర్‌‌‌‌ మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఇవి ఇవ్వడానికి గట్టిగా నాలుగైదు రోజుల్లో మిల్లింగ్‌‌‌‌ చేస్తే సరిపోతుంది. కానీ, ఇంకా గడువేమో దాదాపు రెండు నెలల వరకు ఉంది. 

వచ్చిన బిడ్లతో అమ్మకానికే సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ మొగ్గు..

సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్​మెంట్.. ​టెండర్ల ద్వారా విక్రయానికి పెట్టిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని నష్టానికే అమ్మకానికి మొగ్గుచూపుతోంది. క్వింటాల్​ధాన్యాన్ని రూ.2,060 మద్దతు ధరతో సేకరించగా.. రవాణా, నిల్వ చేసిన గోదాముల కిరాయి అంతాకలిసి దాదాపు రూ.2,350 వరకు ఖర్చు అయింది. కానీ, ఓ కార్పొరేషన్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌, కొందరు వ్యాపారులతో పాటు, గతంలో వడ్లు అమ్ముకున్న మిల్లర్లు కుమ్మక్కై చాలా స్వల్పంగా కోట్​చేసి బిడ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. క్వింటాల్‌‌‌‌ వడ్లు రూ.1,950 నుంచి రూ.2,050 వరకే ధర పెట్టినట్లు  సమాచారం. ఈ తతంగాన్ని అంతా అధికారులు గోప్యంగా ఉంచారు. దేశవ్యాప్తంగా వరి సాగు పడిపోవడంతో పాటు బహిరంగ మార్కెట్‌‌‌‌లో మన వడ్లకు మరింత డిమాండ్‌‌‌‌ ఉంది. ఇలా టెండర్ల ద్వారా వచ్చిన ధరకు వడ్లు అమ్ముకోవడం ద్వారా  క్వింటాల్‌‌‌‌కు రూ.300పైగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఇలా 35లక్షల టన్నుల వడ్లు అమ్ముకుంటే  రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వస్తుంది. కానీ, నిర్ణీత కాలంలో మిల్లింగ్‌‌‌‌ చేయించుకుని సీఎంఆర్‌‌‌‌ రూపంలో  కేంద్రానికి  ఇస్తేనే నష్టం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెండర్లతో వచ్చిన ధరకు అమ్ముకునే నిర్ణయాన్ని పక్కకు పెట్టి మిల్లింగ్‌‌‌‌ను వేగవంతం చేస్తేనే  నష్టం నుంచి బయట పడే అవకాశం ఉందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు.