డే పాస్ టికెట్ రేటును తగ్గించిన ఆర్టీసీ

డే పాస్ టికెట్ రేటును తగ్గించిన ఆర్టీసీ

హైదరాబాద్ ,వెలుగు: సమ్మర్​లో ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ డే పాస్ టికెట్ రేటును తగ్గించింది. గతంలో టీ 24 టికెట్ రూ.100 ఉండగా దాన్ని రూ.90కు తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు రూ.80 కే ఇస్తామని ప్రకటించింది. గురువారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని, టికెట్ తీసుకునే టైమ్ లో సీనియర్ సిటిజన్స్ కండక్టర్లకు ఆధార్ కార్డ్ చూపించాలని తెలిపింది. టీ 24 టికెట్ కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు అమ్ముడుపో తున్నాయని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్  పేర్కొన్నారు.

మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ -6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50కి ఆ టికెట్ కొంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీలో ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​లకు ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు జర్నీ చేయవచ్చన్నారు.