
మండల కేంద్రంలోని శుభవార్త చర్చి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లు బండలాగు పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శుభోదయం యూత్ కమిటీ సభ్యులు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఎడ్ల జట్లు రానున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. - మఠంపల్లి, వెలుగు