
హైదరాబాద్, వెలుగు: స్కూల్ స్టూడెంట్లకు డిజిటల్ పాఠాలను చెప్పేందుకు టీశాట్సిద్ధమైంది. గురువారం నుంచి బ్రిడ్జి కోర్సు క్లాసులను ప్రారంభిస్తున్నట్టు టీశాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లాసులు ప్రసారమవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు ఆధునిక సాంకేతికతో కూడిన విద్యను అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
అందులో భాగంగా గురువారం నుంచి 30వ తేదీ వరకు క్లాసులను నిర్వహిస్తామని, ఆదివారం సెలవు ఉంటుందని తెలిపారు. మూడో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అరగంట చొప్పున నిడివి కలిగిన పాఠాలను డిజిటల్ క్లాసుల్లో చెప్తామన్నారు. మ్యాథ్స్, హిందీ, ఇంగ్లిష్, సైన్స్‌తో పాటు మిగతా సబ్జెక్లుల్లో రోజుకు మూడు గంటల చొప్పున 9 రోజులు పాటు 27 గంటలు ప్రసారమవుతాయని వివరించారు. ఆఫ్‌లైన్‌లో రెగ్యులర్ గా టీచర్లు చెప్పే లెసన్స్కు అనుబంధంగా ఈ డిజిటల్ క్లాసులూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.