డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు: ప్రొపెసర్ లింబాద్రి

డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు: ప్రొపెసర్ లింబాద్రి

నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు.

హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్ లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దక్షిణ భారత బ్రిటీష్ కౌన్సిల్, యూకే లోని బంగోర్, అబరిస్టిత్ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్ లోని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం... సెస్ తో కలిసి ఉన్నత విద్యా మండలి వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం, యూకే విశ్వవిద్యాలయాల కృషిని ప్రొఫెసర్ లింబాద్రి కొనియాడారు.