హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ ఏఈఈ, డీఏఓ పేపర్స్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఎగ్జామ్ సెంటర్ నుంచి వాట్సాప్ ద్వారా పేపర్స్ లీక్ చేసిన టోలిచౌకిలోని ఓ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్, తెలంగాణ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ చైర్మన్ సయ్యద్ మహ్మద్ అలీని శుక్రవారం సిట్ అరెస్ట్ చేసింది. పరీక్షలు ప్రారంభమైన తర్వాత సయ్యద్ వాట్సప్ ద్వారా పేపర్ షేర్ చేశాడు. ఇందుకోసం రూ.16 లక్షలు వసూలు చేశాడు.
తను ఇన్విజిలెటర్‌గా ఉన్న సెంటర్‌లో హాజరు కాని అభ్యర్థుల పేపర్స్ ఫొటోలు తీసి రమేశ్ కు పంపాడు. మలక్‌పేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా రమేశ్ గ్యాంగ్ అభ్యర్థులకు ఆన్సర్స్ అందించింది. ఇలా రమేశ్ సహకారంతో నలుగురు ఏఈఈ, ముగ్గురు డీఏఓ పరీక్షలు రాశారు. ఇలా పరీక్షలు రాసిన అభ్యర్థులతో పాటు రమేశ్‌ను, కాల్‌సెంటర్ ఏర్పాటు చేసిన ఖాలీద్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.తాజాగా పరారీలో ఉన్న సయ్యద్ మహ్మద్‌ను అరెస్ట్ చేశారు.
