
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పేపర్ లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూ రాష్ట్ర ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్ల తరపున సుప్రీం అడ్వొకేట్ వివేక్ ఠంకా వాదనలను వినిపిస్తున్నారు.
మరో వైపు నాల్గో రోజు 9 మంది నిందితులను సిట్ విచారిస్తోంది. గ్రూప్ 1 పేపర్ ను ఇంకెవరెవరికి ఇచ్చారనేదానిపై ఆరాదీస్తుంది. విదేశాల నుంచి రప్పించి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినట్లు గుర్తించిన సిట్..వారి వివరాలను సేకరిస్తోంది. అలాగే ఎగ్జామ్ లో 100 కు పైగా మార్కులు వచ్చిన వారి లిస్ట్ ను సిట్ రెడీ చేసింది. నిందితురాలు రేణుక ప్రవీణ్ కు తెలియకుండా మరి కొంతమందికి ఏఈ పేపర్ అమ్మినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్ సీ పేపర్ తీసుకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టనుంది.
నిందితుడు రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి సిట్ వెళ్లింది. రాజశేఖర్ రెడ్డి మండల పరిధిలో అత్యధిక మందికి గ్రూప్ 1 లో 100 మార్కులకు పైగా వచ్చినట్లు కొందరు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ బృందం రాజశేఖర్ రెడ్డి మాల్యాల మండలానికి వెళ్లి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వారి వివరాలను సేకరిస్తోంది.