TSPSC Paper Leak : ఓయూలో విద్యార్థుల ఆందోళన

TSPSC Paper Leak : ఓయూలో విద్యార్థుల ఆందోళన

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఓయూలో ఆందోళన నెలకొంది. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పేపర్ లీక్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను తొలగించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని, మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయో ఆయా పరీక్షలను రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని కోరారు. ప్రశ్నా పత్రాలు లీక్ చేసి అమ్ముకుంటున్న వారిని  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్ కు తరలించారు.