TSPSC : మరో పేపర్ లీక్.. పరీక్ష రద్దు!

TSPSC : మరో పేపర్ లీక్.. పరీక్ష రద్దు!

టీఎస్ పీఎస్ సీ  పేపర్ లీక్ లో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ కాగా..  మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు.  ఎగ్జామ్ కు రెండు రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు.  దీంతో ఈ పరీక్షను కూడా రద్దు చేసే యోచనలో టీఎస్ పీఎస్సీ ఉంది. 837 పోస్టులకు ఎగ్జామ్ జరిగింది. 68 వేల 257 మంది ఈ ఎగ్జామ్ రాశారు.

మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందంటూ తమకు మార్చి 11 టీఎస్ పీఎస్ సీ నుంచి తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ తో పాటు  రాజశేఖర్ అనే వ్యక్తి పేపర్ లీక్ చేసినట్లు  చెప్పారు. పాస్ వర్డ్స్ హ్యాక్ చేసి పేపర్లు డౌన్ లోడ్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు.