TSPSC :పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు

TSPSC :పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు

టీఎస్ పీఎస్ సీ( TSPSC)  ఎగ్జామ్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎగ్జామ్ పేపర్  లీకేజీకి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులపై( TSPSC) వేటు వేసింది.  అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న  ప్రవీణ్ ను సస్పెండ్ చేయడంతో పాటు  ఔట్ సోర్సింగ్  పోస్టులో నెట్ వర్క్  ఎక్స్ పర్ట్ గా పని చేస్తున్న రాజశేఖర్ రెడ్డిని టర్మీనెట్ చేస్తున్నట్టు TSPSC సెక్రెటరీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్  తో పాటు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కలిసి పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పాస్ వర్డ్ హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ ను డౌన్ లోడ్ చేశారని చెప్పారు. వీరితో పాటు ఇటీవలే టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి ఎంపికైన రేణుక అనే గురుకుల్ టీచర్ కూడా ఉన్నారని చెప్పారు. డౌన్ లోడ్ చేసిన పేపర్స్ ను రేణుక ఇంటికి తీసుకెళ్లిందని, ఆ తర్వాత అభ్యర్థులైన గోపాల్ నాయక్, శ్రీను నాయక్ లకు వాట్సాప్ లో వాటిని సెండ్ చేసిందని పోలీసులు తెలిపారు. రేణుక భర్త కూడా డీఆర్డీఏలో టెక్నికల్ విభాగంలోనే పని చేస్తాడని కూడా చెప్పారు.