పేరుకే డీలక్స్ బస్సు.. ఘాట్ రోడ్ ఎక్కలేక తుస్స్!

పేరుకే డీలక్స్ బస్సు.. ఘాట్ రోడ్ ఎక్కలేక తుస్స్!

వికారాబాద్, వెలుగు: అది పేరుకే డీలక్స్ బస్సు.. కానీ అనంతగిరి కొండను చూడగానే దానికి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఘాట్ రోడ్డు వద్దకు రాగానే ఈ కొండను నేను ఎక్కలేను బాబోయ్ అంటూ మొరాయించింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన టీఎస్34 జె 0028 తాండూరు డిపో బస్సు శనివారం అనంతగిరి నంది ఘాట్ రోడ్డు వద్దకు రాగానే ఒక్కసారిగా మొరాయించింది. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికులు బస్సు దిగి పాదయాత్ర మొదలుపెట్టారు.

ప్రయాణికుల బరువు తగ్గగానే బస్సు నెమ్మదిగా కొండపైకి చేరుకోగా, ఆ వెనకాలే ఆయాసపడుతూ నడిచి వచ్చిన ప్రయాణికులు మళ్లీ బస్సు ఎక్కి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ఘటనపై తాండూరు డిపో మేనేజర్ సురేశ్​ బాబును వివరణ కోరగా.. ‘బస్సు కొండ ఎక్కలేదా? నా దృష్టికి రాలేదే!’ అంటూ చాలా కూల్​జవాబిచ్చారు.