ఆర్టీసిీ డ్రైవర్లకు.. కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆర్టీసిీ డ్రైవర్లకు.. కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

సికింద్రాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,  డ్రైవర్ కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జూబ్లీ బస్ స్టాండ్  వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఒక సమస్య కూడా పరిష్కరించకుండా, రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకుండా కార్మికులపై పని భారాలు మోపుతున్నారని ఆరోపించారు.

కుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైన  తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాబోవు కాలంలో ఆర్టీసీ నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీ ఇవ్వాల్సిన రాయితీలను సకాలంలో ఇవ్వకపోవడం,  నిధులను కేటాయించకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ ను పెంచుకుంటూ పోవడం ఇవన్నీ ఆర్టీసీకి నష్టం కలిగిస్తుందని అన్నారు.

వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని డ్రైవర్ కండక్టర్లను ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని ఖాళీలు ఉన్నవాటిలో రిక్రూట్ మెంట్  చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.