టీఎస్ఆర్టీసీ రాఖీ కానుక.. బహుమతులు అందజేసినఎండీ సజ్జనార్

టీఎస్ఆర్టీసీ రాఖీ కానుక.. బహుమతులు అందజేసినఎండీ సజ్జనార్

రాఖీ పండుగ సందర్భంగా మహిళా ప్రయాణికుల్లో విజేతల కోసం సెప్టెంబర్ 08 హైదరాబాద్ ఎంజీబీఎస్ లో లక్కీ డ్రా తీశారు. విజేతలకు ఎండీ సజ్జనార్ బహుమతులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా మొదటి  బహుమతి రూ. 25వేలు, రెండో బహుమతి 15వేలు, మూడో బహుమతి 10వేల రూపాయలు అందించామని పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల్లో మొత్తం 33 మందిని విజేతలుగా ఎంపిక చేశామన్నారు. రాఖీ పండుగ నాడు లక్కీ డీప్ లో 3 లక్షల మంది మహిళలు పాల్గొన్నారని సజ్జనార్ పేర్కొన్నారు. 

ALSO READ : ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు: తమిళి సై

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. దసరా, సంక్రాంతి, దీపావళి పండుగలకు కూడా స్పెషల్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలందరికీ డబుల్ ధమాకా లభించిందని వివరించారు. రాఖీ పండుగ సమాజంలో చాలా పెద్ద పండుగ అని సజ్జనార్ చెప్పుకచ్చారు. 

గత సంవత్సరం కంటే ఈ సారి రాఖీ పండగకు ఆదాయం ఎక్కువగా వచ్చిందని ఆయన తెలిపారు. రాఖీ పండుగ రోజు( ఆగస్టు 30, 31 తేదీల్లో) ఆర్టీసీ బస్సులు 37 లక్షల కిలోర్లు నడిచాయని పేర్కొన్నారు. 

ఆర్టీసీ చరిత్రలోనే ఇదోక ఒక మైలు రాయిగా నిలిచిందని సజ్జనార్ అన్నారు. పట్టణం నుంచి మారుమూల పల్లెటూరి వరకు ఆర్టీసీ నడుస్తుందని తెలిపారు. ఆర్టీసీలో కొత్తగా వేయి బస్సులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. కాగా రేపటి(సెప్టెంబర్ 09) నుంచి మహిళల కోసం హైదరాబాద్ లోని కోటీ, బోరబండ, మెహదీపట్నం ఏరియాల్లో కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయని సజ్జనార్ తెలిపారు.