ఆర్టీసీ ఉగాది ఆఫర్.. వృద్ధులకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీ ఉగాది ఆఫర్.. వృద్ధులకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అనేక అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ఆర్టీసీ మరో మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ సారి వృద్ధులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది రోజున 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఈ బంపర్ ఆఫర్ ఉగాది ఒక్క రోజు మాత్రమేనని తెలిపిన సంస్థ.. ఇలాంటి ఆఫర్లతో ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపిన ఎండీ సజ్జనార్.. 2 ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసుల్లో 65 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్‌కు ఉచితంగా ప్రయాణం అందించేందుకు ముందుకు వచ్చామన్నారు. సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్ కు చూపించి ఈ సదుపాయం పొందాలని తెలిపారు.