తిరుమలలో బర్త్ డే వేడుకలు.. దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

తిరుమలలో బర్త్ డే వేడుకలు.. దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

తిరుమలలో బర్త్ డే పార్టీ చేసుకున్న దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేం తనూజపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కొండపై బర్త్ వేడుకలు జరుపుకోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంపై ఆగ్రహించిన టీటీడీ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం (ఫిబ్రవరి 06) ఫిర్యాదు చేసింది. 

గురువారం (మార్చి 06) దివ్వెల మాధురి, తనూజ అత్యుత్సాహంతో బర్త్ డే వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. తిరుమలలో బర్త్ డే వేడుకలు, ఫోటో, వీడియో షూట్ నిషేధం అని తెలిసి కూడా బర్త్ డే జరుపుకోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. 

ఈ వ్యవహారంపై స్పందించిన టీటీడీ..  దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సదరు ఘటనపై విచారణ చేస్తున్నారు.. అని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 

నెటిజన్ల ఆగ్రహం:

బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి.. తన స్నేహానికి గుర్తుగా బిగ్‌బాస్ బ్యూటీ తనూజ పుట్టస్వామికి ఇచ్చిన సర్‌ప్రైజ్ కాస్తా విమర్శలకు దారితీస్తోంది. తిరుమల పవిత్రతను విస్మరించారనే విమర్శలకు దారితీస్తోంది. గతంతో కూడా తిరుమల కొండపై మాధురి నిబంధనలను అత్రికమించారని ఇప్పుడు మరోసారి చేశారని  భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ వేడుకలు జరిగిన ప్రదేశమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్ హౌస్‌లో జరిగినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో టీటీడీ (TTD) కొండపైకి కేకులు తీసుకెళ్లడం, బర్త్‌డే వేడుకలు నిర్వహించడంపై కఠిన నిషేధం విధించింది. నియమ నిబంధనలు పక్కన పెట్టి దివ్వెల మాధురి తిరుమల కొండపైకి కేక్ తీసుకెళ్లి మరీ తనూజతో కట్ చేయించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు.