కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు పంపింది. టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకులు పులివెందులకు వెళ్లి వైఎస్ జగన్ నివాసంలో పూజలు చేయడంపై టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒంటిమిట్ట ఆలయ అర్చకులు వైఎస్ జగన్కు పులివెందులలోని తన ఇంట్లో వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన సంగతి తెలిసిందే.
మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించారనే ఆరోపణలపై.. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి.. ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.
►ALSO READ | అనంతపురంలో 'హనీ ట్రాప్' కలకలం: మాటలతో మహిళల ఎర.. అడ్డంగా బుక్కైన సీఐలు!

