జుబెర్​ సూపర్.. సెమీస్ లో సబలెంకాకు షాక్

జుబెర్​ సూపర్.. సెమీస్ లో సబలెంకాకు షాక్
  •     వొండ్రుసోవాతో టైటిల్​ ఫైట్​
  •     నేటి మెన్స్​ సెమీస్​లో జొకోవిచ్​ x సినర్​ అల్కరాజ్ x​ మెద్వెదెవ్

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ : వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో సంచలనం నమోదైంది. టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ అరీనా సబలెంకాకు.. ట్యూనీషియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆన్స్‌‌‌‌‌‌‌‌ జుబెర్‌‌‌‌‌‌‌‌ ఊహించని షాకిచ్చింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ సెమీ ఫైనల్లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ జుబెర్‌‌‌‌‌‌‌‌ 6–7 (5/7), 6–4, 6–3తో సబలెంకా (బెలారస్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. 2 గంటలా 19 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జుబెర్‌‌‌‌‌‌‌‌ తొలి సెట్‌‌‌‌‌‌‌‌ కోల్పోయినా పట్టు విడవకుండా పోరాడింది.

తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో ఆరు ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టిన బెలారస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ను తర్వాతి రెండు సెట్లలో బలమైన ఫోర్‌‌‌‌‌‌‌‌హ్యాండ్‌‌‌‌‌‌‌‌, బ్యాక్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌తో కట్టడి చేసింది. మూడు ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టిన జుబెర్‌‌‌‌‌‌‌‌ మూడు డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. 14 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌, 28 విన్నర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు పది బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. ఐదు డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేసిన సబలెంకా 45 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. 

వొండ్రుసోవా రికార్డు

రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌లో మార్కెటా వొండ్రుసోవా (చెక్‌‌‌‌‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌) 6–3, 6–3తో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. తాజా విజయంతో ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎరాలో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన తొలి అన్‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఆమె రికార్డు సృష్టించింది. గంటా 15 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చెక్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌కు ఎదురులేకుండా పోయింది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 4 ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టిన వొండ్రుసోవా 22 విన్నర్స్‌‌‌‌‌‌‌‌తో ఈజీగా గెలిచింది.

11 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఆరు గెలుచుకుంది. సర్వీస్‌‌‌‌‌‌‌‌ల్లో తడబడిన స్వితోలినా బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకోవడంలోనూ ఫెయిలైంది. 24 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద పాయింట్లను నెగ్గడంలో విఫలమైంది.

సెమీస్‌‌‌‌‌‌‌‌తోనే సరి

ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) జోడీకి చుక్కెదురైంది. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ 5–7, 4–6తో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ వెస్లీ కూలాఫ్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)–నీల్‌‌‌‌‌‌‌‌ స్కుప్‌‌‌‌‌‌‌‌స్క్‌‌‌‌‌‌‌‌ (బ్రిటన్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు. దీంతో ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎరాలో  గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఓల్డెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాలనుకున్న బోపన్న కల నెరవేరలేదు. గంటా 26 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బోపన్న ద్వయం సర్వీస్‌‌‌‌‌‌‌‌ల్లో తడబడింది.

తమ సర్వీస్‌‌‌‌‌‌‌‌ల్లో 77 శాతం పాయింట్లు నెగ్గిన బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌లో మాత్రం 58 శాతంతో సరిపెట్టుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సానియాతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరిన బోపన్న.. ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌తో కలిసి రెండు ఏటీపీ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాడు. 2010 యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్​  రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన బోపన్న మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగుసార్లు గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ సెమీస్‌‌‌‌‌‌‌‌కు చేరాడు.