వివాదాస్పద పోస్టులు పెట్టాడనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను ఆయా సంస్థలు బ్లాక్ చేశాయి. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయాడు. దాంతో జో బైడెన్ గెలుపును అధికారికంగా ధృవీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సమావేశమయ్యారు. అదే సమయంలో అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చిన ట్రంప్ మద్దతుదారులు అల్లర్లకు దిగారు. నిరసనకారులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందింది.
ఈ అల్లర్లను చెలరేగడానికి సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన వివాదాస్పద పోస్టులే కారణమని భావించిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలు ఆయన ఖాతాలను బ్లాక్ చేశాయి. క్యాపిటల్ భవనంలో అల్లర్లు జరిగిన తర్వాత ట్రంప్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. తన మద్ధతుదారులందరూ శాంతియుతంగా ఉండాలని వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియోను కూడా ఫేస్‌బుక్ తొలగించింది. ఆయన ఖాతాను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్లు చేసినందుకు గాను ఆయన ట్విట్టర్ ఖాతాను 12 గంటలపాటు బ్లాక్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. అయితే ఆయన చేసిన వివాదాస్సద ట్వీట్లు తొలగించకపోతే ఈ నిలిపివేత మరికొంతకాలం కొనసాగుతోందని ట్విట్టర్ తెలిపింది. ఇన్‌స్టాగ్రాం కూడా ఇదే నియమాన్ని ఫాలో అవుతూ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసింది.
కాగా.. అమెరికా క్యాపిటల్ భవనంలో జరిగిన ఘటనపై భారత ప్రధాని స్పందించారు. ‘వాషింగ్టన్ డీసీలోని కాంగ్రెస్ భవనంలో జరిగిన కాల్పులు బాధ కలిగించాయి. అధికార బదిలీ శాంతియుతంగా జరగాలి. నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆపాలనుకోవడం సరికాదు’ అని మోడీ ట్వీట్ చేశారు.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021
వాషింగ్టన్ డీసీలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వాషింగ్టన్‌లో 15 రోజుల పాటు పబ్లిక్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
For More News..
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై వాదనలు
పరిహారం కోసం నాలుగేండ్లుగా ఆఫీసుల చుట్టూ..
సంక్రాంతికి 146 స్పెషల్ ట్రైన్స్.. 30% అదనపు ఛార్జీలు
