యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. భువనగిరి పట్టణంలోని ఓ జూనియర్ కాలేజీలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీ ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీ చేసిన పోలీసులు వారి దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
వనగిరి పట్ణణంలోని ఓ జూనియర్ కాలేజీ ఆవరణలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం(మే15, 2026) పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన హబీబ్ బుర్రన్ రెహ్మాన్, ఖదీర్ అనే ఇద్దరు యువకులు కాలేజీలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుబడటంతో కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. కాలేజీ ఆవరణలో డ్రగ్స్ కలకలంతో విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు.
