బషీర్‌బాగ్, వెలుగు: ఇల్లీగల్‌గా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఏపీ కడప జిల్లాకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో ననేవత్ దినేశ్‌కుమార్ నాయక్(22), పర్ణపల్లి సాయిప్రదీప్(24) సిమ్ కార్డుల డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్నారు. వీరు సిమ్ కార్డులు కొనేందుకు వచ్చే కస్టమర్లకు తెలియకుండా వారి ఫింగర్ ప్రింట్లు, కేవైసీ వివరాలను సేకరించి కొత్త సిమ్ కార్డులను అక్రమంగా యాక్టివేట్ చేస్తున్నారు.
ఇలా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. శనివారం నాంపల్లిలో సిమ్ కార్డులను విక్రయించేందుకు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 150 ఎయిర్‌టెల్, 34 జియో యాక్టివేటెడ్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
