V6 News

రాజక్కపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన గుడ్లు తిని.. ఇద్దరు చిన్నారులకు అస్వస్థత

రాజక్కపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన గుడ్లు తిని.. ఇద్దరు చిన్నారులకు అస్వస్థత

తొగుట( దుబ్బాక), వెలుగు: అంగన్​వాడీ సెంటర్​లో కుళ్లిన గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, పేరెంట్స్​ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలోని అంగన్​వాడీ సెంటర్–1 టీచర్  సత్యవతి మంగళవారం సెలవులో ఉండగా, ఆయా చిన్నారులకు ఉడకబెట్టిన గుడ్లను భోజనంలో పెట్టారు. 

చిన్నారులు తిన్న గుడ్లు కుళ్లి పోవడంతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు అంగన్​వాడీ సెంటర్  దగ్గర ఆందోళనకు దిగారు. నాసిరకం, కుళ్లిన గుడ్లు పెట్టి చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వాంతులు చేసుకున్న చిన్నారులు ఆ తరువాత తేరుకోవడంతో పేరెంట్స్​ కుదుటపడ్డారు.