జామియాలో మళ్లీ కాల్పుల కలకలం

జామియాలో మళ్లీ కాల్పుల కలకలం

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా వర్సిటీ ఏరియాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వారంలో వరుసగా మూడోసారి కాల్పులకు జరిగాయి. మొన్న జామియా దగ్గర, నిన్న షహీన్ బాగ్ దగ్గర కాల్పులకు పాల్పడగా…లేటెస్ట్ గా జామియా వర్శిటీ దగ్గర మరో ఇద్దరు కాల్పులు జరిపారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వర్శిటీ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగిన తర్వాత జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మొదట ఐదో నంబరు గేటు, తర్వాత ఒకటో నంబరు గేటు దగ్గర కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే జామియా దగ్గర కాల్పులు జరగడం వారం రోజుల్లో ఇది మూడో సారి.